హసన్ పర్తి, వెలుగు : రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి చరిత్ర సృష్టించిన విద్యాసంస్థగా ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్ నిలిచిందని కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్ తెలిపారు. ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండ్ ఇయర్ ఎంపీసీలో తీగల సాయి శ్రేష్ఠిత 997 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచిందని చైర్మన్ పేర్కొన్నారు.
సెకండియర్ లో నిశిత 988, సాయి ప్రియ 987 మార్కులు సాధించగా, ఫస్ట్ఇయర్ఎంపీసీలో పోతరావేని అమూల్య 467, తంగళ్లపల్లి భవ్య 462, బీపీసీలో అర్చన 427, షన్మయి 426 మార్కులు సాధించారన్నారు. సీఈసీలో కస్తూరి వైశాలి, శ్రీజ 483 మార్కులు సాధించారు. కళాశాల యాజమాన్య సభ్యులు ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి, తీగల రాజ్ కుమార్, కోటిచింతల మమత, లాడే శివ విద్యార్థులను అభినందించారు.
