అవితేజ్, కోయిల్ దాస్ జంటగా సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఫెయిల్యూర్ బాయ్స్’. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వంలో విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఫెయిల్యూర్ అంటే విజయానికి మరొక మెట్టు అని హీరో అవితేజ్ అన్నాడు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని, కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుందని దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి చెప్పాడు. జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి ఎలా పైకి రావాలో తెలియజేసే చిత్రం ఇదని నిర్మాత విఎస్ఎస్ కుమార్ అన్నారు. నటులు శ్రీనివాస్ జమ్మి, అంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
