రీల్స్ పిచ్చి.. యువకుల మధ్య ఘర్షణ

రీల్స్ పిచ్చి.. యువకుల మధ్య ఘర్షణ

జూబ్లీహిల్స్, వెలుగు: రీల్స్ పిచ్చి రెండు బస్తీల యువకుల మధ్య గొడవకు దారితీసింది. ఫిలింనగర్ పరిధిలోని బసవతారక నగర్​కు చెందిన కొందరు యువకులు రీల్స్ చిత్రీకరించేందుకు పక్కనే ఉన్న దుర్గ భవాని నగర్ ప్రాంతానికి వెళ్లగా, స్థానిక యువకులు వారిని అడ్డుకున్నారు. 

‘మా ప్రాంతంలో రీల్స్ ఎందుకు తీస్తున్నారు?’ అని ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు పాల్పడిన 9 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి బైండోవర్ చర్యలు చేపట్టారు.