హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులు తమ ఆచరణను సమీక్షించుకోవడానికి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పలువురు మేధావులు గుర్తుచేశారు. సమాజంలో శాంతిని పెంపొందించే లక్షంతో, మార్పుకు దోహదపడాల్సిందిగా సర్కార్‌ను కోరుతున్నామని ప్రొఫెసర్లు హరగోపాల్, నరసింహరెడ్డి, రమా మేల్కొటే, కోదండరాం, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, కల్పన కన్నాభిరామ్, శ్రీనివాస్ కోరారు.
అనేక ఏండ్లుగా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైన సామాజిక, -ఆర్థిక మార్పుకు మావోయిస్టులు చేసిన కృషి పట్ల తమకు గౌరవం ఉందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
