Job News: ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో పోస్టులు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే..!

Job  News: ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో పోస్టులు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే..!

ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) జూనియర్ ఇంటెలిజెన్స్ గ్రేడ్–II/ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 14.

పోస్టుల సంఖ్య:394(జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–II / టెక్నికల్) జనరల్ 157, ఈడబ్ల్యూఎస్ 32, ఓబీసీ 117, ఎస్సీ 60, ఎస్టీ 28.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్& టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ &  కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్​లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 23. 

లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 14.  

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.650. ఇతరులకు రూ.550. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష,  స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  mha.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

రాత పరీక్ష

ఆన్​లైన్ విధానంలో జరిగే రాత పరీక్షలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 25 శాతం ప్రశ్నలు జనరల్ మెంటల్ ఎబిలిటీ, 75 శాతం ప్రశ్నలు టెక్నికల్ సబ్జెక్టుల నుంచి ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 25 శాతం మార్కులు కోత విధిస్తారు. 

టైర్–1లో అర్హత సాధించాలంటే జనరల్ 35 శాతం, ఓబీసీ 34 శాతం, ఎస్సీ, ఎస్టీ 33 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఐదు రెట్ల మంది అభ్యర్థులను స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్టుకు 30 మార్కులు కేటాయించారు. ఉద్యోగ ప్రొఫైల్​కు అనుగుణంగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. 

ఫైనల్ మెరిట్ లిస్ట్

టైర్–1, టైర్–2, టైర్–3లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. భవిష్యత్తులో భర్తీ  కోసం వెయిటింగ్ జాబితా కూడా రూపొందిస్తారు.