కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II/ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టులు: 258.
పోస్టుల సంఖ్య: కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 90, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 168.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
తప్పనిసరిగా గేట్ 2023 లేదా 2024 లేదా 2025లో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ (గేట్ కోడ్: ఈసీ) లేదా కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గేట్ కోడ్: సీఎస్) కటాఫ్ మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25.
అప్లికేషన్ ఫీజు: అన్రిజర్వ్డ్, ఈబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200. ఇతరులకు రూ.100.
లాస్ట్ డేట్: నవంబర్ 16.
సెలెక్షన్: గేట్ 2023 లేదా 2024 లేదా 2025లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్: ఉద్యోగ ప్రొఫైల్‌కు అనుగుణంగా ప్రాక్టికల్, టెక్నికల్ రూపంలో ఉంటుంది.
ఇంటర్వ్యూ: సంబంధిత విభాగంలో సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్స్ స్కిల్‌పై ఇంటర్వ్యూ ఉంటుంది.
ఫైనల్ మెరిట్ లిస్ట్: గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్టును తయారు చేస్తారు.
పూర్తి వివరాలకు mha.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
