ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ అరెస్ట్

ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ అరెస్ట్

ఏసీబీ అధికారిని అంటూ మీర్ పేట మున్సిపల్ కమిషనర్  వసంతని వేధిస్తున్న  ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్  అన్వర్ హుసేన్ ని మీర్ పేట పోలీసులు అరెస్టు చేశారు.  వివరాలిలా ఉన్నాయి. అన్వర్ హుసేన్ అనే వ్యక్తి  20 రోజుల నుంచి రోజూ ఫోన్ చేసి వేధిస్తున్నట్లు మీర్ పేట్ కమిషనర్  వసంత ఈ నెల 28న మీర్ పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  ఈ నెల 27 తేదీన బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి  అన్వర్​ హుస్సేన్​ కాల్ చేసి  మీర్ పేట్ మున్సిపల్ కమిషనర్ పై ఏసీబీ దాడులు జరుగుతున్నాయిని తెలిపారు . కమిషనర్ వసంత నా ఫోన్ కాల్ లిఫ్ట్​ చేయడం లేదని దాడుల విషయం ఆమెకు మీరు  సమాచారం ఇవ్వాలని కోరాడు.  గతంలో వసంత బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు  అన్వర్ హుసేన్  తాను  ఏసీబీ అధికారినంటూ  పరిచయం చేసుకున్నాడని  పోలీసులు తెలిపారు. 20 రోజుల నుంచి తరచు వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయడంతో  అన్వర్​ను శుక్రవారం  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.