విద్యార్థుల రికగ్నిషన్ ఫీజు చెల్లించండి..కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ లేఖ

విద్యార్థుల రికగ్నిషన్  ఫీజు చెల్లించండి..కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఈ విద్యా సంవత్సరం ఫస్టియర్​లో చేరిన విద్యార్థులకు సంబంధించిన రికగ్నిషన్  ఫీజును మేనేజ్ మెంట్లు చెల్లించాలని ఇంటర్  బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.  దీంతోపాటు గ్రీన్ ఫండ్​ కూడా తీసుకోవాలని సూచించారు. రికగ్నిషన్  ఫీజు రూ. 220, గ్రీన్ ఫండ్  ఫీజు రూ.15 విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాల ప్రిన్సిపల్స్​కు ఆయన లేఖ రాశారు. 

ఈ నెల 24 నుంచి 31 వరకు ఇంటర్  బోర్డు ఖాతాలో వాటిని జమ చేయాలని ఆదేశించారు. వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.in లోని పేమెంట్  గేట్‌వేను ఉపయోగించి ఆన్‌లైన్ లోనే ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని సూచించారు. అయితే, గవర్నమెంట్  కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చామని ప్రకటించారు.