
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీటియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి పరీక్ష ప్రారంభం కాగా.. నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న ముగ్గురు విద్యార్థులను అధికారులు గేటు బయటే నిలిపివేశారు. దీంతో ఏం చేసేది లేక విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.
కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. భగత్ నగర్ ట్రినిటీ జూనియర్ కళాశాల సెంటర్ లో ఒక నిమిషం నిబంధన మేరకు ఆలస్యంగా వచ్చిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఎగ్జా్మ్ సెంటర్ లోకి అధికారులు అనుమతించలేదు.