
- షెడ్యూల్ రిలీజ్
- ఏప్రిల్ 3న ఫస్టియర్, ఏప్రిల్ 4న సెకండియర్ ఎగ్జామ్స్ కంప్లీట్
- ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్
- షెడ్యూల్ రిలీజ్ చేసిన బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజైంది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 దాకా పరీక్షలు ఉంటాయని సోమవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫస్టియర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 దాకా, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 దాకా జరుగుతాయని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పరీక్షలు కొనసాగుతాయన్నారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల స్టూడెంట్లకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 దాకా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రెండో సెషన్ లో ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ మార్చి 4న ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఉంటుందని, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరగనున్నదని తెలిపారు.
ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్
తేదీ పరీక్ష పేపర్
15.03.2023 సెకండ్ లాంగ్వేజ్
17.03.2023 ఇంగ్లీష్
20.03.2023 మ్యాథమేటిక్స్-ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్
23.03.2023 మ్యాథమెటిక్స్-బీ, జువాలజీ, హిస్టరీ
25.03.2023 ఫిజిక్స్, ఎకనామిక్స్
28.03.2022 కెమిస్ట్రీ, కామర్స్
31.03.2023 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్ (బైపీసీ విద్యార్థులకు)
03. 04.2023 మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
సెకండియర్ ఎగ్జామ్ షెడ్యూల్..
తేదీ పరీక్ష పేపర్
16.03.2023 సెకండ్ లాంగ్వేజ్
18.03.2023 ఇంగ్లీష్
21.03.2023 మ్యాథమేటిక్స్-ఏ, బాటనీ, పొలిటికల్‌సైన్స్
24.03.2023 మ్యాథమెటిక్స్ పేపర్-బీ, జువాలజీ, హిస్టరీ
27.03.2023 ఫిజిక్స్, ఎకనామిక్స్
29.03.2023 కెమిస్ట్రీ, కామర్స్
01.04.2023 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్ (బైపీసీ విద్యార్థులకు)
04.04.2023 మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ