
- అడ్మిషన్లన్నీ లేటే!
- రెండు వారాల తర్వాతే టెన్త్ రిజల్ట్స్
- అడ్మిషన్లకు అప్పటిదాకా ఆగాల్సిందే
- ట్రిపుల్‌ఐటీ, మోడల్ స్కూల్స్ , రెసిడెన్షియల్,పాలిటెక్నిక్ ప్రవేశాల్లో జాప్యం
హైదరాబాద్, వెలుగు:ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఎఫెక్ట్ టెన్త్, యూనివర్సిటీల రిజల్ట్ పై పడిం ది. ఇప్పటికే వర్సిటీ ఎగ్జామ్స్‌లో రీఫామ్స్ కోసం ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయిం చగా.. త్వరలో ఇవ్వనున్న టెన్త్ రిజల్ట్స్ విషయంలో ఆఫీసర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో పాలిటెక్నిక్ , బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు జాప్యం కానున్నాయి.
మీటింగ్‌ల మీద మీటింగ్‌లు..
మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకూ రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలకు సుమారు 5.52లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 27న వాల్యూయేషన్ కూడా పూర్తయింది. ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2,3 తేదీల్లో రిజల్ట్స్ వెల్లడించాలి. కానీ ఇంటర్ లో గందరగోళంతో ప్రభుత్వం అన్ని విభాగాలను అలర్ట్ చేసిం ది. దీంతో టెన్త్ వాల్యూవేషన్ పూర్తయిన కూడా ఒకటికి రెండుసార్లు ఫలితాలను చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు,మూడు రోజులకోసారి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రె డ్డి.. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్ కుమార్ , ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తోపాటుసాంకేతిక సిబ్బందితో సమావేశమవుతున్నారు.దీం తో టెన్త్ ఫలితాలు ఈ నెల మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.దీంతో అడ్మిషన్ షెడ్యూల్స్‌తోపాటు క్లాసులు కూడా లేట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ట్రబుల్
బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 29 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకుంటామని వర్సిటీ ప్రకటించింది.అప్లికేషన్ల స్వీకరణను ఈ నెల 25 వరకు పొడిగించింది. ఇందులో అడ్మిషన్లు పూర్తిగా పదో తరగతిలో వచ్చే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో స్టూడెంట్‌కు వచ్చే గ్రేడ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. సర్కారు స్కూళ్ల నుంచి వచ్చే స్టూడెంట్లకు అదనంగా 0.4(జీపీఏకు) స్కో ర్ కలుపుతారు. ఇదంతా మార్కుల ఆధారంగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ రిజల్ట్స్ రాకపోవడంతో ఈ ప్రాసెస్ ఆగిపోయింది. దీంతో దరఖాస్తుల తేదీ, గడువు కూడా పెంచాల్సి వస్తోంది.
ఇంటర్ అడ్మిషన్లుకూ బ్రేక్
స్టేట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలతోపాటు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, కస్తూర్భాగాంధీ గర్ల్స్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ఏటా మే మొదటివారంలో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్లు చేపడతారు. కానీ ఈసారి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. రెసిడెన్షియల్స్‌లో మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి వాటిలో వచ్చిన మార్కులు, టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. గురుకులాలు మినహా మిగిలిన అన్నింటిలోనూ టెన్త్ గ్రేడ్ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తారు. స్టేట్‌లో సాధారణ ఇంటర్ కాలేజీలు 2 వేల వరకు ఉండగా, గురుకులాలు 300, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్300 (కాలేజీలున్నవి)వరకున్నాయి. ఇవన్నీ టెన్త్ రిజల్ట్స్ తో ముడిపడినవే. అయితే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు మాత్రం ఇప్పటికే అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తున్నాయి. ముం దే అడ్మిషన్లు తీసుకుంటే తక్కువ ఫీజులంటూ ఎరవేస్తున్నారు.
పాలిటెక్నిక్ పై ఎఫెక్ట్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహించారు. అదే నెల 26న రిజల్ట్ కూడా ఇచ్చారు . 95,850 మంది పాలిసెట్‌లో అర్హత సాధించారు. వారందరికీ మెరిట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. మే మొదటివారంలో నోటిఫికేషన్ ఇస్తామని గతంలో అధికారులు చెప్పారు. కానీ టెన్త్ రిజల్ట్స్ రాకపోవడంతో ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు. ఫలితాలు వచ్చాకే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. జూన్ 1 నుంచి తరగతులు నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. ఆ షెడ్యూల్ మారనుంది.