నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

చార్మినార్,​ వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్  చేసినట్లు చార్మినార్  జోన్  డీసీపీ ఖరే కిరణ్​ ప్రభాకర్​ తెలిపారు. బుధవారం పురానీ హవేలీలోని డీసీపీ ఆఫీస్ లో అడిషనల్​ డీసీపీ ఎంఏ మజీద్, మీర్​చౌక్​ ఏసీపీ జి.శ్యాంసుందర్  కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట నసీబ్ నగర్​కు చెందిన అబ్దుల్  రజాక్  ఖాన్ ను అరెస్ట్​ చేసి అతని వద్ద 15 నకిలీ సర్టిఫికెట్లు, ఒక ఫోన్, స్కూటర్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

విదేశాలకు వెళ్లే వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో మీర్​చౌక్  డీఐ ఎన్. సైదయ్య, ఎస్సై సి.అనిత ఎతెబార్  చౌక్‌‌‌‌లో దాడులు నిర్వహించి రజాక్  ఖాన్  వద్ద పూణేలోని మహారాష్ట్ర స్టేట్  బోర్డ్  ఆఫ్  సెకండరీ, హయ్యర్  ఎడ్యుకేషన్‌‌‌‌, తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని ఎస్ఆర్ఎం ఇన్​స్టిట్యూట్  ఆఫ్  సైన్స్  అండ్  టెక్నాలజీకి చెందిన నకిలీ డిగ్రీ గ్రేడ్  కార్డ్  షీట్, బ్యాచిలర్  ఆఫ్  ఫిజియోథెరపీ, కంప్యూటర్  సైన్స్  ప్రొవిజనల్, బీఎస్సీ డిగ్రీ గ్రేడ్  కార్డ్  ఫోలియో స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.