వయసులో తనకంటే పెద్ద మహిళతో పాండ్యా డేటింగ్.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

వయసులో తనకంటే పెద్ద మహిళతో పాండ్యా డేటింగ్.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ఇటీవల క్రీడా వర్గాల్లో మారు మోగిపోతోంది. గత నెలలో తన భార్య నటాషా స్టాంకోవిక్‎కు విడాకులు ఇచ్చిన పాండ్యా.. బ్రిటిష్ సింగర్ కమ్ యాక్టర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతోన్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్‎గా మారాయి. ఇదిలా ఉండగానే.. పాండ్యా కొత్త లవ్ స్టోరీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం పాండ్యా గర్ల్ ఫ్రెండ్‎గా ప్రచారం జరుగుతోన్న జాస్మిన్ వాలియా వయస్సులో అతడి కంటే పెద్ద అని.. దీంతో వీరిద్దరి ఏజ్ గ్యాప్‎పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. పాండ్యా కంటే  జాస్మిన్ వాలియా రెండేళ్లు ఏజ్‎లో పెద్ద కావడం విశేషం.

జాస్మిన్ వాలియా 1991లో జన్మించగా.. పాండ్యా 1993లో జన్మించిన విషయం తెలిసిందే. పాండ్యా నయా లవ్ స్టోరీ గురించి ప్రచారం జరుగుతోన్న సమయంలోనే.. ఈ లవ్ బర్డ్స్ ఏజ్ గ్యాప్ పైన  డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక, క్రికెట్ విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ గెలవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివర్లో‎ అద్బుతమైన బౌలింగ్‎తో క్లాసెన్‎ను ఔట్ చేసి టీమిండియాకు టైటిల్ అందించాడు. 

వరల్డ్ కప్‎లో రాణించినప్పటికీ పాండ్యాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. భారత్ టీ20 కెప్టెన్సీకి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పాండ్యాను పొట్టి ఫార్మాట్‎కు కెప్టెన్‎గా ఎంపిక చేసిన బీసీసీఐ.. శ్రీలంక టూర్‎కు అనుహ్యంగా పాండ్యాను తప్పించింది. టీమిండియా టీ20 పగ్గాలు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‎కు అప్పగించింది. వరల్డ్ కప్‎లో ఆకట్టుకున్న పాండ్యా.. శ్రీలంక టూర్ లో మాత్రం విఫలమయ్యాడు.