హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 29 నుంచి జూన్ 7 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడం.. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఇప్పట్లో పరీక్షలు నిర్వహించేందుకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని గుర్తించి వాయిదా వేశామని ఆయన చెప్పారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రాక్టికల్ పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్ విడుదల చేస్తామని ఆయన వివరించారు.
