- మార్చి 3న జరగాల్సిన సెకండియర్ పరీక్షలు 4వ తేదీకి మార్పు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ (సివిక్స్) పరీక్షల తేదీలు మారాయి. మార్చి 3న నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. హోలీ పండుగ సెలవు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి అనుగుణంగా ‘రివైజ్డ్ షెడ్యూల్'ను ఆయన మంగళవారం విడుదల చేశారు.
కేవలం ఈ ఒక్క రోజు పరీక్ష తేదీ మాత్రమే మారిందని, మిగిలిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
