రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్​ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్​ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు ఆఫీసర్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. రాష్ట్రమంతటా 1,882  సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3,51,913 మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు 2,57,393 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 94,520 మంది ఉన్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది డిపార్ట్​మెంటల్ ఆఫీసర్లను నియమించలేదు. కొత్త కాలేజీల్లోని స్టూడెంట్లు మినహా మిగిలిన స్టూడెంట్లు ఎవరి కాలేజీలో వాళ్లే ప్రాక్టికల్స్ కు అటెండ్ కానున్నారు. ప్రైవేటు కాలేజీలు అక్రమాలకు పాల్పడితే గుర్తింపు రద్దుకు వెనుకాడబోమని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.