
అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. కమిషనర్ మహేష్ భగవత్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న హర్యానా కి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశామని , మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయిని 5.5కేజీల చొప్పున పాకెట్లు గా తయారు చేసి కంటైనర్ లో సప్లై చేస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. మొత్తం 1010కేజీల (194 ప్యాకెట్ల) గంజాయి తో పాటు ఒక కంటైనర్, 4 వేల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు
హర్యానా కి చెందిన ఇమ్రాన్ అనే వ్కక్తి తన కంటైనర్ తో ఒరిస్సా వెళ్లి, అక్కడ లారీ ని వివేక్ సింగ్ అనే మరో వ్యక్తికి అప్పచెబుతాడని కమిషనర్ తెలిపారు. లారీని తీసుకెళ్లిన వివేక్ సింగ్.. ఒరిస్సాకు చెందిన మహాదేవ్ ఉన్న అటవీ ప్రాంతంలో లారీని నిలుపగా.. మహాదేవ్ అక్కడ స్థానికంగా పండించే వాళ్ళ వద్ద గంజాయి కొని లారీని లోడ్ చేస్తాడని తెలిపారు. గంజాయితో ఉన్న ఆ లారీని ఇమ్రాన్ విజయవాడ మీదుగా వారణాసి తీసుకెళ్తారని చెప్పారు. పక్క సమాచారం తో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కంటైనర్ ని పట్టుకున్నామని చెప్పారు.
20 మంది బాలకార్మికులకు విముక్తి
మరో ఘటనలో బాలాపూర్ పీఎస్ పరిధిలోని ఓ పరిశ్రమలో వెట్టిచాకిరి చేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు రాచకొండ పోలీసులు. సీపీ మహేష్ భగవత్ దీనిపై మాట్లాడుతూ.. ఎర్రకుంట లోని గాజుల కర్మాగారం పై దాడులు చేశామని, ఆ కర్మాగారంలో గయా, బీహార్ కి చెందిన పిల్లలతో పని చేయిస్తున్నారని తెలిపారు. బీహార్ నుండి అక్రమంగా పిల్లలను తరలించి, వారికి కనీసం సరైన భోజనం లేకుండా మధ్య రాత్రి వరకు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు.
20 మంది పిల్లలు కి విముక్తి కల్పించి, నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశామని తెలిపారు. పిల్లలంతా బీహార్ కు చెందిన వారని .. మెడికల్ చెక్ అప్ , పూర్తి అయిన తరువాత 20 మంది చిన్న పిల్లలను కూడా వారిని పోలీస్ బందోబస్తు నడుమ వారిని స్వస్ధలాలకు పంపిస్తామని తెలిపారు.