టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా .. మరో కన్నడ బ్యూటీ

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా .. మరో కన్నడ బ్యూటీ

సప్త సాగరాలు’ దాటి’ అనే కన్నడ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్.  ఎలాంటి స్కిన్‌‌ షో చేయకుండానే తన పెర్ఫార్మెన్స్‌‌తో యూత్‌‌లో ఫాలోయింగ్ పెంచుకుందామె.  ఇప్పుడామె తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా విజయ్‌‌ దేవరకొండకు జంటగా. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

 శ్రీ వెంక‌‌టేశ్వర క్రియేష‌‌న్స్ బ్యాన‌‌ర్‌‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.  రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ రూరల్ యాక్షన్‌‌ డ్రామాలో హీరోయిన్‌‌గా రుక్మిణి వసంత్‌‌ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రెండు కన్నడ చిత్రాల్లో నటిస్తున్న రుక్మిణి.. రెండు తమిళ చిత్రాల్లోనూ ఫిమేల్‌‌ లీడ్‌‌గా చేస్తోంది.