V6 News

ఆర్టీసీని ముంచింది బీఆర్ఎస్సే : మొగుళ్ల రాజిరెడ్డి

ఆర్టీసీని ముంచింది బీఆర్ఎస్సే :  మొగుళ్ల రాజిరెడ్డి
  •      మొగుళ్ల రాజిరెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: ఆర్టీసీ అప్పుల కుప్పగా మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేస్తూ వస్తోందని ఐఎన్టీయూసీ టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ మొగుళ్ల రాజిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్​రావు ఇప్పుడు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యూనియన్ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశంతో కలసి రాజిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 55 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. 

గత ప్రభుత్వం కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిందని, కాంగ్రెస్ వచ్చిన వెంటనే పీఎఫ్ బకాయిలు రూ.600 కోట్లు  నిధులు విడుదల చేసిందన్నారు.  అదే విధంగా డీఏలను ఇస్తూ ఇస్తుందన్నారు. జేఏసీ పెట్టిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కార్మికుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయని , రెండు రోజుల్లో సమ్మెకు పరిష్కారం లభిస్తుందని రాజిరెడ్డి అన్నారు.