ప్రగతి నగర్ హత్య కేసులో విచారణ వేగవంతం.. 14 మంది అరెస్ట్

ప్రగతి నగర్ హత్య కేసులో విచారణ వేగవంతం.. 14 మంది అరెస్ట్

హైదరాబాద్ ప్రగతినగర్ లో జరిగిన హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు మైనర్లుతో సహా 14 మందిని నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు శివప్ప, సిద్ధు, మహేశ్, కౌశిక్, సమీర్, జయంత్, తిరుమల్, గన్నప్ప, ప్రతీక్, రాహుల్‌గా గుర్తించారు, వీరంతా 20 ఏళ్ల వయస్సులో ఉన్నారని, నలుగురు మైరర్లని పోలీసులు తెలిపారు. తిరుమల్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడని, బోరబండ పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీట్ దాఖలు చేసినట్లు ఉందని బాచుపల్లి పోలీసులు తెలిపారు.

  నిందితులు కొన్ని రోజుల ముందే హత్యకు ప్లాన్ వేశారని ఏప్రిల్ 8న హత్య చేసినట్టు పోలీసులు తెలపారు. SR నగర్ లో 2023 అక్టోబర్ లో జే. తరుణ్ అనే వ్యక్తి  తేజు అనే వ్యక్తిని హత్య చేశాడు. దీంతో తేజు.. జే. తరుణ్ స్నేహితులు అతన్ని చంపుతారని భయపడి ప్రగతినగర్ లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు తరుణ్ స్నేహితులు తేజును ఫాలో అయ్యారు.

 ఒంటరిగా ఉన్న సమయంలో తేజును పట్టుకుని హత్య చేశారు. హత్య చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీడియో పై పోలీసులు స్పందిస్తూ కేసు నమోదు చేసుకున్నామని నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 2024 ఏప్రిల్ 11న ఈ కేసుకు సంబంధించి నలుగురు మైనర్లుతో సహా 14 మందిని నగర పోలీసులు అరెస్టు చేశారు.