సీబీఐ స్పెషల్ కోర్టులో కవితకు నో రిలీఫ్..

సీబీఐ స్పెషల్ కోర్టులో కవితకు నో రిలీఫ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీబీఐ అరెస్ట్ చేయటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ స్పెషల్ కోర్టును  ఆశ్రయించారు. ఎటువంటి నోటీసు  లేకుండా సీబీఐ అరెస్టు చేయటంపై  కవిత తరపున్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  కవిత తరపు న్యాయవాదులు రాణా, మోహిత్ రావు తమ వాదనలు వినిపించారు. 

అయితే విచారణ సందర్భంగా..  తన ఎదుట మద్యం  కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్నారు సీబీఐ స్పెషల్ కోర్టు  జడ్జి మనోజ్ కుమార్.  ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని చెప్పారు. తన ఎదుట అత్యవసర  జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతాయనన్నారు.   ఏప్రిల్ 12న ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టులో  పిటిషన్ వేయాలని  సూచించారు.

ఈడీ కేసులో ఇప్పటికే తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న BRS ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. కవిత అరెస్టు విషయమై  ఏప్రిల్ 11న  మధ్యాహ్నం 12 గంటలకు..తీహార్ జైలు అధికారులకు సీబీఐ బృందం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. IPC 477, 120(B),PC యాక్ట్ సెవన్ సెక్షన్ల కింద కవితను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12న  సీబీఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించనున్నారు. తొలుత ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిపోర్టు సమర్పించి సీబీఐ హెడ్ ఆఫీస్ కు కవితను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లోని 6వ నెంబర్ బారక్ లో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.