ప్రతి ఏటా వచ్చే సంక్రాంతి కంటే ఈ ఏడాది సంక్రాంత్రి పండుగ టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత రూత్ ప్రభుకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పెళ్లయిన తర్వాత భర్త రాజ్ నిడిమోరుతో ఆమె జరుపుకున్న మొదటి సంక్రాంతి ఇదే కావడం. గత డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 15న ఈ జంట తమ పండగ ఫోటోను పంచుకోవడంతో అది నెట్టింట వైరల్ అవుతోంది.
రెడ్ అవుట్‌ఫిట్స్‌లో 'ట్విన్నింగ్'
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటోలో ఈ జంట ఎంతో క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలో వీరిద్దరూ సంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. సమంత మెరూన్ కలర్ డ్రెస్‌లో, నుదుటన చిన్న బిందీతో చాలా సింపుల్‌గా, అందంగా కన్పించారు. కారులో ప్రయాణిస్తూ దిగిన ఈ సెల్ఫీలో సమంత తనదైన స్టైల్‌లో ఒక ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగా, రాజ్ నిడిమోరు చిరునవ్వుతో ఫోజులు ఇచ్చారు. "Sankranthi Vibes" అంటూ తన భర్త రాజ్‌తో కలిసి ఉన్న సెల్ఫీని ఆమె పోస్ట్ చేశారు.
Also Read : జపాన్‌ను ఊపేస్తున్న 'పుష్ప2' మేనియా..
ప్రేమ ప్రయాణం మొదలు..
సమంత , రాజ్ నిడిమోరుల పరిచయం వృత్తిపరంగా మొదలైంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత 'రాజీ' పాత్రలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో చెన్నై సూపర్ చాంప్స్ టీమ్‌ను సపోర్ట్ చేస్తూ వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరి రిలేషన్‌షిప్‌పై రూమర్లు మొదలయ్యాయి. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ .. డిసెంబర్ 1న కోయంబత్తూరులో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.
కొత్త జీవితం..
గతంలో నటుడు నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను సైతం ధైర్యంగా జయించిన ఆమె, ఇప్పుడు రాజ్ నిడిమోరుతో తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఈ జంట ఆడంబరాలకు దూరంగా, చాలా సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సంక్రాంతి వేడుకలు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సొంతంగా జరుపుకుంది.
పెళ్లయినప్పటికీ సమంత తన కెరీర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అటు రాజ్ నిడిమోరు కూడా తన విలక్షణమైన కథలతో ఇండియన్ ఓటీటీ ,సినిమా రంగంలో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ 'సామ్' తన జీవిత భాగస్వామితో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకోవడం చూసి నెటిజన్లు "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
