సంక్రాంతి పండుగ రోజున తగ్గిన బంగారం రేట్లు అదే జోరును కనుమ రోజున కూడా కొనసాగిస్తున్నాయి. పైగా గోల్డ్ తో పాటు ఇవాళ వెండి రేటు కూడా కొద్దిగా తగ్గటం విశేషం. పండక్కి షాపింగ్ కి వెళుతున్న వారు ఈ తగ్గింపులను అందిపుచ్చుకోవచ్చు. అయితే తమ ప్రాంతంలోని తాజా రేట్లను ముందుగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యమని అస్సలు మర్చిపోకూడదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.
జనవరి 16 కనుమ పండుగ రోజున బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను కొనసాగిస్తున్నాయి. దీంతో జనవరి 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.22 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 340గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 145గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీ ఉన్నప్పటికీ నేడు కొద్దిగా తగ్గింది. అయితే శుక్రవారం జనవరి 16, 2025న వెండి రేటు కేజీకి రూ.3వేలు తగ్గటంతో కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 06వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.306 వద్ద ఉంది.
