ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్ లో డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజం డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రోన్ డే, రేసింగ్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు (జనవరి 16-17) కొనసాగనుంది. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న షో జనవరి 15 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ షో ను చూసేందుకు నగరవాసులు భారీగా స్టేడియానికి చేరుకున్నారు.
డ్రోన్ రేసింగ్ నిర్వాహకురాలు రుద్రాక్ష చెప్పిన వివరాల ప్రకారం.. 8 టీమ్ లు డ్రైన్ రేసింగ్ లో పాల్గొంటున్నాయి. ఇందులో 40 పైలెట్ లు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు డ్రోన్ షో ఉంటుంది. ఇప్పటికే టికెట్ల అమ్మకం పూర్తయింది. శనివారం (జనవరి 17) ఫైనల్స్ జరుగుతాయి.
సాకర్ రేసింగ్ , రిమెంట్ కంట్రోల్ షో చూసేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ తరలివస్తున్నారు. అన్ని డ్రోన్లు భారతదేశంలో తయారైనవే. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలే కాదు డ్రోన్లు కూడా ఆకాశంలో చక్కర్లు కొడతాయని ప్రోగ్రాం పెట్టడం జరిగిందని అన్నారు.
