జ్యోతిష్యం: మకరరాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు.. మూడు రాశులవారికి జాక్ పాట్ .. మిగతా వారికి ఎలా ఉందంటే..!

జ్యోతిష్యం:  మకరరాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు.. మూడు రాశులవారికి జాక్ పాట్ .. మిగతా వారికి ఎలా ఉందంటే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు గ్రహాలకు యువరాజు.. తెలివితేటలు.. వ్యాపారంలో లాభ నష్టాలను బుధుడే నిర్ణయిస్తాడు. అందుకే బుధుడు తరచుగా తన స్థానాన్ని మార్చుకుంటాడు.  ఈ క్రమంలో  జనవరి 17 వ తేది  మధ్యాహ్నం 12:58 గంటలకు మకరరాశిలోకి  బుధుడు ప్రవేశిస్తాడు.  బుధ గ్రహం స్థానం మారడంతో  పన్నెండు రాశులపైనా ప్రభావం  ఉంటుందని  పండితులు చెబుతున్నారు.   జ్యోతిష్య పండితుల అంచనాల మేరకు  మూడు రాశుల  ( మేషం, సింహం, మకరం) వారికి స్వర్ణయుగం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.. . .

మేషరాశి: మకరరాశిలో ....  బుధుడు కలవడం వలన  ఈ రాశి వారికి  అన్ని రకాలుగా కలసి వస్తుంది. ఇప్పటి వరకు ఏర్పడిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి.  కావలసిన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే నాలుగు రెట్ల లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు అనుకూలమైన ప్రదేశంలో.. . ఆశించిన జాబ్​ లభిస్తుంది.

వృషభరాశి:  బుధుడు సంచారం మకరరాశిలోకి మారడం  వలన ఈ రాశి వారికి  కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.  ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి.  ఆర్థిక విషయంలో కొంత పురోగతి ఉంటుంది.  అలాగే అనుకోకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి.  ఉద్యోగస్తుల విషయంలో ప్రశంసలు పొందినా.. మానసికంగా ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి . ఆరోగ్య పరంగా  ఇబ్బంది పడే అవకాశం ఉంది . ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.

మిథునరాశి :మకర రాశిలో బుధుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు కెరీర్​ పరంగా చాలా పడాల్సి ఉంటుంది.  అయినాసరే అనుకున్న ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులు సామాన్య లాభాలను పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. . నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ ఆఫర్లు లభించే అవకాశం ఉంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూల సమయంకాదని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా దూరపు ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటంతో మాసనికంగా సంతోషంగా గడిపే అవకాశం ఉందని  జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ .. పెళ్లి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

కర్కాటకరాశి : బుధుడు.. మకరరాశిలో సంచరించే  సమయంలో ఈ రాశి వారికి  ప్రతికూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వృత్తిపరంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు లాభాలు అంత ఆశాజనకంగా ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్త వుతాయి.  ఆర్థిక విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  ఆరోగ్య పరంగా నరాల సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి  వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. 

సింహరాశి:  బుధుడు రాశిని మార్చుకోవడం వలన ఈ రాశికి చెందిన  ఉద్యోగ .. వ్యాపారస్తులు  ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడటంతో మనశ్శాంతి ఉంటుంది.  జీవిత భాగస్వామి సలహా..సూచనలను పాటించాలని పండితులు చెబుతున్నారు.   ఎప్పటి నుంచో పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ.. మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.  ఎవరికి మధ్యవర్తిగాఉండవద్దు.. ఎలాంటి హామీల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

కన్యారాశి: మకరరాశిలో .. బుధ గ్రహ సంచారంతో  ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కేరీర్​లో హెచ్చు తగ్గులుంటాయి.  అయినా మీ పనితీరుతో  అధికారులు బాగా సంతృప్తి చెందుతారు. పెండింగ్​ లో ఉన్న ప్రాజెక్ట్​లను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆరోగ్య పరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

తులారాశి :బుధుడు మకరరాశిలో సంచారం వలన   ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి.  ప్రతి విషయంలోను.. మీకు సంబంధం లేకుండా మాట పడాల్సి వస్తుంది.  వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.    జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది.. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది. ప్రతి విషయంలో ఓపిక.. సహనం పాటించండి.. చివరిలో  అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

వృశ్చికరాశి: బుధుడు మకరరాశిలో సంచారం వలన  ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. కేరీర్​ విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఉంటుంది.  మెరుగైన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి.. ఆదాయం మాత్రం పెరగదు.   తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ..పెళ్లి విషయాలను వాయిదా వేయండి.. 

ధనుస్సు రాశి: మకర రాశిలో   బుధ సంచారం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది.  ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు అధికంగా ఉంటాయి.  స్నేహితులు ,బంధువుల నుంచి  శుభవార్తలు అందుకుంటారు.  కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు దక్కుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.మీరు వీసా, పాస్ పోర్ట్ కోసం  దరఖాస్తు చేసే వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరమని పండితులు చెబుతున్నారు. 

మకరరాశి: బుధుడు.. మకరరాశిలోబుధుడు సంచారం వలన ఈ రాశి వారికి  శుభ ఫలితాలు వస్తాయి. నూతన గృహాలను, భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. డబ్బు సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కుంభరాశి:మకర రాశిలో .. బుధుడు  సంచారం వలన ఈ రాశికి చాలా మంచి జరుగుతుంది.  గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది.  మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆఫీసులో మీరే కీలకం కావడంతో  ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  తొందరపడి ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మీనరాశి: బుధుడు .. మకర రాశిలో సంచరించడం వలన ఈ రాశివారికి గడ్డుకాలమని పండితులు అంటున్నారు.  ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తారు.  పనిభారం పెరుగుతుంది. ఆశించినంతగా ఆర్థికంగా పురోగతి ఉండదు.  వ్యాపారస్తులు పోటీ మార్కెట్​ లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలకు మించి ఖర్చులు ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.      

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.