గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో గుండెలవిసే విషాదం జరిగింది. సంక్రాంతి పండగ రోజున ఓ గాలిపటం దారం (మాంజా) కారణంగా భార్యాభర్తలు సహా ఏడేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది.
ఏం జరిగిందంటే?
రెహాన్ అనే వ్యక్తి తన భార్య రెహానా, కూతురు ఆయిషాతో కలిసి సంక్రాంతి పండుగ పూట బైక్‌పై బయటకు వెళ్లారు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ పై వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక గాలిపటం దారం రెహాన్ మెడకు చుట్టుకుంది.
ఒక చేత్తో ఆ దారాన్ని తీసే ప్రయత్నంలో రెహాన్ బైక్‌పై కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బైక్ వేగంగా వెళ్లి వంతెన గోడను ఢీకొట్టింది. దింతో ముగ్గురూ ఫ్లైఓవర్ పైనుంచి దాదాపు 70 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. కింద పడగానే రెహాన్, కూతురు ఆయిషా అక్కడికక్కడే చనిపోయారు.
రెహానా కింద ఆగి ఉన్న ఒక ఆటోపై పడటంతో మొదట ప్రాణాలతో బయటపడింది. కానీ తీవ్ర గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. ఒక్క గాలిపటం దారం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
