మౌని అమావాస్య ( జనవరి 18) న పుణ్య స్నానం.. గొప్ప ఫలితం.. పెండింగ్ సమస్యలు పరిష్కారం.. పురాణాల్లో ఏముంది..

మౌని అమావాస్య ( జనవరి 18) న పుణ్య స్నానం.. గొప్ప ఫలితం.. పెండింగ్ సమస్యలు పరిష్కారం..  పురాణాల్లో ఏముంది..

హిందువులు పండుగలకు.. పబ్బాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.  పుష్యమాసం అమావాస్య తిథికి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది.  ఆరోజు ( జనవరి18) పుణ్య నదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల  పితృ దోషాలు తొలగడమే కాకుండా..  పెండింగ్​ సమస్యలు పరిష్కారమవుతాయిని పండితులు చెబుతున్నారు.  ఆ రోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు పుణ్య స్నానాలు చేయాలి?.. పురాణాల్లో ఏముంది.. పండితులు ఏం చెబుతున్నారు..  మౌని అమావాస్య రోజున గంగానది స్నానం చేయడం ఎందుకు అంత ముఖ్యమైనది..  దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. . .

 హిందూ మతంలో మౌని అమావాస్య రోజు పితృ దేవతలను స్మరించుకుని.. వారికి తర్పణాలు ఇచ్చేందుకు  చాలా పవిత్రంగా భావిస్తారు.  పుణ్య నదుల్లో  పిండ ప్రదానం చేస్తే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.  ఆరోజున (జనవరి 18)పుణ్యనదుల్లో చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు. 

మౌని అమావాస్య ఎప్పుడు?


ఈ సంవత్సరం (2026) మౌని అమావాస్య జనవరి 18 న జరుపుకుంటారు. అమావాస్య తేదీ జనవరి 18 న తెల్లవారుజామున 12:03 గంటలకు ప్రారంభమై జనవరి 19 న తెల్లవారుజామున 1:21 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి సంప్రదాయం ప్రకారం, ఈ పండుగ జనవరి 18 న జరుపుకుంటారు.

 మౌని అమావాస్య .నదీ స్నానం ప్రాముఖ్యత

మౌని అమావాస్య రోజున ( జనవరి 18)  పితృదేవతలకు నైవేద్యాలు, పిండ ప్రదానం.. దానాలు కూడా చేస్తారు. ఆ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పెద్దలు ఉత్తమలోకాలకు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే.. ఆరోజు ( జనవరి 18) వారి పేరున నీళ్లు.. నువ్వులను.. తర్పణాలు వదిలితే ఉత్తమలోకాలకు చేరుకుంటారని  పండితులు చెబుతున్నారు. 

Also Read : కనుమ పండుగ..వ్యవసాయ పండుగ.. ఆ రోజు ఎవరిని పూజించాలి.. ఏమేమి తినాలి..

మౌని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. మౌని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు. మౌని అమావాస్య నాడు పుణ్య నదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే అమావాస్య రోజుల్లో  పుణ్య నదుల్లో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.

మౌని అమావాస్య కథ

గరుడ పురాణం ప్రకారం..ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడపురాణం ద్వారా . కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య చాలా ధార్మికురాలు... పతివ్రత.. గుణవంతురాలు.  దేవస్వామి  బ్రాహ్మణ దంపతులకు 7 కుమారులు  ఒక కుమార్తె ఉన్నారు.   దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు, జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు. నీకు అల్లుడుగా  నీచుడు.. దుర్మార్గుడు.. తల్లి దండ్రులను పట్టించుకోనివాడు.. భార్యను .. అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు.  అంతేకాదు పెళ్లి అయిన అనతి కాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు.  విధి అలా ఉంది.  దానిని ఎవరూ తప్పించలేరు కదా..అని జ్యోతిష్కులు చెబుతారు. 

ఏది జరగాలో శివుడి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు  వివాహ వయస్సు రావడంతో  ... ఓ బ్రాహ్మణునకు  నరసింహుడు అనే వ్యక్తికి  ఇచ్చి పెళ్లి చేస్తారు.  నరసింహుడు చాలా దుష్టుడు.. చెడ్డవాడు అని తెలిసినా..అతని తల్లి దండ్రులు.. దాచిపెట్టి.. వివాహం అయిన తరువాత అయినా మారుతాడేమొనని.. గుణవంతురాలు.. వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు.

పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ.. మాంసం తినుచూ.. భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు. నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు.  ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక  ... అతని తండ్రి చంపాడు.  ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి.. అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు.  ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం.  ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండప్రదానం చేశాడు. అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు.

పురాణాల ప్రకారం పెద్దలకు పుణ్య నదుల్లోస్నానం చేసి తర్పణాలు వదలడం అతి ముఖ్యమైన ఆచారం.పుష్యమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య  ( 2026 జనవరి 18) నదీ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. . వీటిని అమృత స్నానం అని పిలుస్తారు.  ఇలా చేయడం తెలిసో.. తెలియకో   చేసిన పాప ..పుణ్యాల కర్మల వలన  మౌని అమావాస్య రోజున నదీతీరంలో తర్పణాలు వదిలితే.. ఉత్తమలోకాలకు చేరుకొని  పితృదేవతలు ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్నసందేహాలకు ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.