సంక్రాంతి అంటే... ఒక్కరోజు జరుపుకునే పండుగకాదు. మూడు రోజులు కుటుంబమంతా కలిసి సంబురంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగ ఇది. మొదటి రోజు గి, రెండో రోజు సంక్రాంతి, ఇక మూడో రోజు కనుమ పండుగ గురించి తెలుసుకుందాం. . !
పంట చేతికి రావడానికి రైతులు అంతాఇంతా కష్టపడరు. కష్టంలో పశువుల భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి. సంపదలు, సంతోషాలకు కారణమైన పశువులను కృతఙ్ఞతతో పూజించడమేకనుమ పండుగ ముఖ్య ఉద్దేశం. వ్యవసాయరంగంలో బసవన్నలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ALSO READ : ఉత్తరాయణ పుణ్యకాలం.. ప్రాధాన్యత..విశిష్టత ఇదే..!
పాడి ద్వారా గోమాతలు ఆర్థికంగా అదుకుంటాయి. అందుకే కనుమ రోజును
'పశువుల పండుగ' అంటారు.
ఏం చేస్తారు?
రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పశువులు ఎంతగానో సహాయ పడతాయి. అందుకే ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా.. పశువులు, పక్షులతో పంచుకుంటారు. అందుకే పిట్టల కోసం దాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఆవులు, ఎద్దులకు పూజచేస్తారు. అన్నం పెట్టే పొలానికి నైవేద్యం పెడతారు.
ALSO READ : సంక్రాంతి పండుగ.. గాలి పటాల పండుగ.. మొదటి కైట్ ఎప్పుడు ..
పశువుల పూజ
కనుమ రోజు రైతన్నలు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో ఆరోజు ఎలాంటి పనీ చేయించరు. ఆ రోజు ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరికి తీసుకెళ్లి స్నానం చేయిస్తారు. నుదుట పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములను కూడా ప్రత్యేకంగా రకరకాల రంగులు వేసి అలంకరిస్తారు. తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు. కొత్తధాన్యంతో పొంగలి వండి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. అలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెందుతాయని రైతుల విశ్వాసం.
మినప గారెలు
కనుమకు మరో ప్రత్యేకత ఉంది. కొన్ని ప్రాంతాల్లో కనుమ నాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే. 'మినప గారెలు చేసుకొని ఉంటారు. 'కనుమ రోజు కాకి కూడా సామెత. అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అల్లుళ్లు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు కనుమ రోజు తప్పనిసరిగా మాంసాహారం వండుకుని.. ఉంటారు. అలాగే ముత్తెదువులకు పసుపు బొట్టు కూడా ఇస్తారు.
ALSO READ : భోగాలకు దక్షిణాయనం.. పుణ్యకర్మలకు ఉత్తరాయణం..
ద్వాపర యుగం నుంచే...
ఈ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటునట్లు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు. అలా గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్ధనగిరిని పూజించేవారు... గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు... అప్పట్నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి మరుసటి రోజున కనుము పండుగ జరుపుకుంటున్నారు. ఇదండీ సంక్రాంతి కనుమ ప్రాధాన్యత.. అందుకే కనీసం కనుమ పండుగరోజైనా ( 2026 జనవరి 16) రైతన్నతో పాటు పాడి పశువులను పూజిద్దాం. . .!
