సంక్రాంతి పండుగ.. గాలి పటాల పండుగ.. మొదటి కైట్ ఎప్పుడు .. ఎవరు ఎగరేశారు..!

సంక్రాంతి పండుగ.. గాలి పటాల పండుగ.. మొదటి కైట్ ఎప్పుడు .. ఎవరు ఎగరేశారు..!

దేశ వ్యాప్తంగా మకరసంక్రాంతి వేడుకలు మిన్నంటుతున్నాయి.  గాలిపటాలను ఎగురవేస్తూ జనాలు కేరింతలు ( 2026 జనవరి 15) కొడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో హైదరాబాద్​.. వరంగల్​.. విజయవాడ..,తిరుపతి వంటి నగరాలే కాకుండా.. పల్లెల్లో కూడా గాలిపటాలు  ఎగురవేస్తున్నారు. గాలిపటాన్ని మొదట త్రేతా యుగంలో శ్రీరాముడు ఎగురవేశాడని అప్పటినుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. 

మకర సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలతోపాటు గాలి పటాలను దేశవ్యాప్తంగా  ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రధాన నగరాల్లో  ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను చాలా చాలా ఉత్సాహంగా( 2026 జనవరి 15)న జరుపుకుంటున్నారు.  సంక్రాంతి పండుగ రోజు  గాలిపటాలను ఎగురవేయడం రామాయణం  కాలంలో అంటే త్రేతా యుగం నుంచి ప్రారంభమయిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  రామచరితమానస కాలంలో  మొఘలుల పరిపాల సమయంలో కూడా సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలను ఎగురవేశారని చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. 

ALSO READ : భోగాలకు దక్షిణాయనం.. పుణ్యకర్మలకు ఉత్తరాయణం..

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగ. ఈ పండుగ రోజు  గాలి పటాలు ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతుంది.  పిల్లల నుంచి పెద్దల వరకు రంగు రంగుల గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందిస్తారు. 

త్రేతాయుగంలో శ్రీరాముడు..

పూర్వకాలంలోనే గాలి పటాలను త్రేతా యుగంలో  శ్రీరాముడు, అతని సోదరులు కూడా ఎగురవేశారని పండితులు చెబుతున్నారు.  తమిళ రామాయణం ప్రకారం మకర సంక్రాంతి రోజు మొదటగా గాలిపటాలు శ్రీరాముడు ఎగుర వేశారని   వారి గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరిందంటే .. ఆ గాలి పటం  ఇంద్రలోకానికి చేరిందని చెబుతారు. అప్పటి నుంచి .. ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ రోజు గాలిపటాలు ఎగురవేయడం ఒక ఆచార సంప్రదాయం గా మారింది.తులసీదాస్ రాసిన రామచరితమానస్‌లో కూడా బాలకాండలో...  శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటం ఎగురవేసిన విషయాలను  ప్రస్తావించారు.

ALSO READ : ఆధ్యాత్మికం: సంక్రాంతి పండుగ.. మోక్షానికి మార్గం..

గాలిపటాలు ఎగురవేయడం.. ఆరోగ్య ప్రయోజనాలు 

మకర సంక్రాంతి పండుగతో చలి తగ్గడం ప్రారంభమవుతుంది. గాలిపటాలను ఎగురవేయడం వలన చేతులకు కాళ్లకు మంచి వ్యాయామం ఏర్పడుతుంది. సూర్యకిరణాలు మన శరీరానికి అందుకుంటాయి.  విటమిన్ ..డి ...శరీరానికి అంది  శక్తిని ఇ ఇస్తుంది. చర్మ సమస్యలు తగ్గి, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ALSO READ : 18న ఆదివారం మౌని అమావాస్య..

గాలి పటాలకున్న మరో చరిత్ర

గాలిపటాలకు 2వేల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తోంది. మొదట గాలిపటాలను దేశాల మధ్య సందేశాన్ని పంపడానికి  ఉపయోగించారు. చైనా యాత్రికులు ఫా-హియెన్, జువాన్జాంగ్ వీటిని భారతదేశానికి పరిచయం చేశారట. యుద్ధభూముల్లో సమాచారం పంపడం... ఆ తరువాత మొఘలులు ఢిల్లీలో గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు. క్రమంగా  ఇది భారతీయులు ప్రతి  ఇళ్లలో ఒక వినోదపు ఆటగా మారింది.  అందుకే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్​ లో భాగంగా గాలిపటాలను ఎగరేస్తూ ఎంజాయి చేస్తారు.