తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డి వంటి వివిధ పేర్లతో పండుగ చేసుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మకర సంక్రాంతి సౌర చక్రం ఆధారంగా ఉంటుంది
మనిషి కర్మలు చేయడం వల్ల అతనికి సుఖదుఃఖాలు లభిస్తాయి. ఈ సుఖదుఃఖాలనుభవించేస్థితికే భోగం అని పేరు. ఈ భోగ దశనే తాంత్రికవేత్తలు భోగి అని పిలిచారు. పురాణాల ప్రకారం మనిషి భోగాలనుభవించే సమయమే దక్షిణాయనం. .. ఎప్పుడైతే కర్మ ఫలాలను ఆశించకుండా పుణ్య కర్మలు చేస్తూ, భోగాలనుంచి విముక్తిని పొందుతాడో... అప్పుడే అతనికి స్వర్గలోక కలుగుతుంది. దీన్నే ఉత్తరాయనంగా వేద పండితులు గుర్తించారు.
ALSO READ : సంక్రాంతి పండుగ.. మోక్షానికి మార్గం..
హిందువుల పండుగలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అవి కేవలం పాశ్చాత్యుల కాలమానం ప్రకారం వచ్చినవి కావు. హిందువుల జరునుకొనే పండుగలను పండితులు నాలుగు విధాలుగా విభజించారు.
- మొదటి విధం : మహాపురుషుల జన్మదినోత్సవాలను బట్టి చేసుకునేవి...
- రెండవ విధం : ఋతువులను బట్టి జరుపుకునేవి...
- మూడవ విధం : శైవం, వైష్ణవం మొదలైన సంప్రదాయాలను బట్టి నిర్వహించేవి...
- నాల్గవ విధం : జన్మ దినోత్సవాలను బట్టి, ఋతువులను బట్టి, సంప్రదాయాలను బట్టి జరుపుకోకుండా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు జరుపుకొనేవి.
ALSO READ : 18న ఆదివారం మౌని అమావాస్య..
సంక్రాంతి రెండవ రకం పండుగ... ఋతువును బట్టి వచ్చే పండుగగా హిందువులు దీనిని భావిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్గశీర్షం లేదా పుష్య మాసంలో వస్తుంది. సూర్యుని సంచారాన్ని ఆధారంగా చేసుకొని సంక్రాంతి పండుగను పంచాంగ కర్తలు నిర్ధారిస్తారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ... సూర్యుడు ఆరు మాసాలు దక్షిణాయనంలో ఉండి... తరువాత ఉత్తరాయనానికి పోయే సందర్భంలో వచ్చే పండుగగా దీన్ని లెక్కిస్తారు. ఇదే విధంగా చాలాకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు జరుపుకునే పండుగను భోగి అని, మూడవ రోజు కనుమ అని పిలుస్తారు. భోగి మరుసటి రోజు జరుపుకునే పండుగకే సంక్రాంతి అని పేరు.
ALSO READ : సంక్రాంతి పండుగ రోజు( 2026 జనవరి 15) కొనాల్సిన వస్తువులు ఇవే..!
వాస్తవానికి నిజానికి సంవత్సరానికి పన్నెండు సార్లు సంక్రాంతి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులను గుర్తించారు. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉండడం చేత, దాన్ని ఆ మాసంలో ఆ నక్షత్రానికి సంబంధించిన సంక్రాంతిగా లెక్కిస్తారు. ఇట్టి సంక్రాంతులలో మకర సంక్రాంతి ముఖ్యమైనది. సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణం అని పిలుస్తారు. ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన దినమే సంక్రాంతి పర్వదినంగా పండితులు చెబుతున్నారు.
సూర్యుడు దక్షిణ దిశలో ఆరు మాసాలు, ఉత్తర దిశలో ఆరు మాసాలు సంచరించడాన్ని అయనమని వ్యవహరిస్తారు. జ్యేష్ఠ మాసం నుంచి పుష్య మాసం దాకా దక్షిణంలో ఉండడమే దక్షిణాయనం. మార్గశిరం నుండి వైశాఖం దాకా ఆరుమాసాలు ఉత్తర దిశలో ఉండడమే ఉత్తరాయన కాలంగా పండితులు చెబుతున్నారు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
