దాదాపు 28 ఏళ్ల డామినెన్స్ కు తెరపడింది. దేశంలోనే అత్యంత ధనిక కార్పోరేషన్ అయిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ థాక్రేల చేతుల నుంచి జారిపోయింది. గురువారం (జనవరి 15) జరిగిన BMC ఎన్నికల్లో థాక్రేల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ బీజేపీ-శివసనే కూటమి కార్పోరేషన్ చేజిక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ఫలితాల విడుదల సందర్భంగా మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ సాధించిన ఎన్డీఏ కూటమి ముంబై మేయర్ పీఠాన్ని అధిరోహించనుంది.
బీఎంసీలో మొత్తం 227 వార్డులకు గానూ బీజేప 95 వార్డులకు పైగా దూసుకెళ్తోంది. అదే సమయంలో ఆ పార్టీ పార్టనర్ శివసేన (షిండే) 30 వార్డులలో లీడ్ ఉంది. ముంబై కార్పోరేషన్ దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 114 వార్డులు రావాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీ-శివసేన కూటమి లీడ్లో దూసుకుపోతోంది.
మరోవైపు మరాఠీ ఆత్మగౌరవం అనే నినాదంతో థాక్రే బ్రదర్స్ కలిసి పోయినా ఫలితాలు మాత్రం వారికి అనుకూలంగా రాలేదు. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) రెండూ కలిపి 74 స్థానాల లీడ్ లో ఉన్నాయి. ఇందులో ఉద్ధవ్ థాక్రే శివసేన 63 సీట్లలో ముందంజలో ఉంది. 2017లో 84 వార్డులు దక్కించుకున్న ఆ పార్టీ ఈ సారి అంత ప్రభావం చూపలేకపోయింది. రాజ్ థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ కేవలం 9 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. దీంతో వీరిద్దరూ కలిసినా కూడా ముంబై పీఠాన్ని దక్కించుకోలేకపోతున్నారనేది గమనార్హం.
