విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఫైనల్ కు సౌరాష్ట్ర దూసుకెళ్లింది. శుక్రవారం (జనవరి 16) పంజాబ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ అలవోక విజయం సాధించింది. బెంగళూరు వేదికగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో జరిగిన ఈ మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఈజీగా ఛేజ్ చేసి సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టింది. సౌరాష్ట్ర ఓపెనర్ విశ్వరాజ్ జడేజా (127 బంతుల్లో 165) భారీ సెంచరీతో చెలరేగి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర కేవలం 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 293 పరుగులు చేసి గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెనర్లు హర్నూర్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చక్కటి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 60 పరుగులు జోడించారు. 39 పరుగులు చేసి హర్నూర్ సింగ్ ఔటైనా అన్మోల్‌ప్రీత్ సింగ్ (100), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (87) సెంచరీ భాగస్వామ్యంతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 109 పరుగులు జోడించడం విశేషం. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 87 పరుగులు చేసి ఔటైన తర్వాత ఒక్కసారిగా పంజాబ్ ఇన్నింగ్స్ స్లో అయింది. మిడిల్ ఓవర్లో అందరూ చేతులెయ్యడంతో అల్మొప్రీత్ ఒక్కడే పోరాడాల్సి వచ్చింది.
ఒక ఎండ్ లో క్రీజ్ లో ఉన్న అల్మొప్రీత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో రమణ్ డీప్ సింగ్ 42 పరుగులు చేసి జట్టుకు భారీ అందించాడు. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. తొలి వికెట్ కు విశ్వరాజ్ జడేజా, హార్విక్ దేశాయ్ తొలి వికెట్ కు ఏకంగా 172 పరుగులు జోడించి జట్టుకు దాదాపుగా విజయం ఖాయం చేశారు. 64 పరుగులు చేసి హార్విక్ దేశాయ్ ఔటైనా ప్రేరక్ మన్కడ్ తో కలిసి ఓపెనర్ జడేజా చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఛేజింగ్ లో అంతా జడేజా వన్ మ్యాన్ షో సాగింది. 127 బంతుల్లో 165 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీటిలో 18 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
Watch 📽️
— BCCI Domestic (@BCCIdomestic) January 16, 2026
Snippets of Vishvarajsinh Jadeja's blockbuster 💯 in the chase of 292 against Punjab 💥
Scorecard ▶️ https://t.co/xkGgrl714z#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/GT5qp5hsYM
