ఇదేం కక్కుర్తి రా బాబు.. చేపల ట్రక్కు ఢీకొని బాలుడు చనిపోతే.. వీళ్లు చేసిన పనికి యాక్ తూ అంటారు !

ఇదేం కక్కుర్తి రా బాబు.. చేపల ట్రక్కు ఢీకొని బాలుడు చనిపోతే.. వీళ్లు చేసిన పనికి యాక్ తూ అంటారు !

ఇది కరువు అనాలో.. కక్కుర్తి అనాలో తెలియదు కానీ.. పక్కనోడు చచ్చినా బతికినా మనకు అవసరం లేదు.. దొరికింది దోచుకో అన్నట్లుంటది మనవాళ్ల పరిస్థితి. అప్పట్లో ఆయిల్ ట్యాంకర్ పడిపోతే కొందరు బకెట్లో నింపుకెళ్లారు.. ఆ మధ్య కూరగాయల బండి పడిపోతే సంచుల్లో ఎత్తుకెళ్లారు. ఏంటీ ఈ మనుషులు అనుకున్నారు అంతా. కానీ ఈ ఘటన చూస్తే నిజంగానే యాక్ తూ అని అనకుండా ఉండలేరు.

బీహార్ లోని సీతామర్హి జిల్లాలో జరిగిన ఘటన ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేసింది. ఝాఝిహాట్ గ్రామ సమీపంలో చేపల లోడ్ తో వచ్చిన ఒక లారీ ఒక పిల్లవాడిని ఢీకొట్టింది. గ్రామానికి చెందిన సంతోష్ దాస్ కుమారుడు రితేశ్ కుమార్ అలియాస్ గోలు (13) అనే విద్యార్థి ట్యూషన్ కు వెళ్తుండగా ట్రక్ ఢీకొట్టింది. చాలా దారుణంగా జరిగిన ఈ యాక్సిడెంట్ చూసి స్థానికులు భయంతో కేకలు వేశారు. తల్లిదండ్రులు తమ కొడుకు కోసం తీవ్ర ఆందోళనకు గురయ్యారు

పేరెంట్స్ పుట్టెడు దుఖంలో ఏడుస్తుంటే.. అక్కడ జనాలు వ్యవహరించిన తీరు చూస్తే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు మరి కొందరు గుమిగూడి ఉంటే.. మరోవైపు చేపల కోసం జనాలు కొట్టుకున్న తీరు చూస్తే.. మానవత్వం గురించి ఇక్కడ మాట్లాడుకోవడం వేస్ట్ అనేలా కనిపించింది పరిస్థితి.

చేపలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో కుక్కలు, పిల్లులు మాంసపు ముక్కల కోసం ఎగబడినట్లుగా.. ఎగబడ్డారు. బాలుడి శవంతో తల్లిదండ్రుల రోదన వీరి చెవుల్లోకి ఇసుమంత కూడా ఎక్కలేదు. ఒక్కరి గుండె కూడా కరగలేదు. ఒక్క కన్ను కూడా చెమ్మగిల్లలేదు. యాక్సిడెంట్ జరిగిందని, బాలుడు చనిపోయాడనో పోలీసులకు , అంబులెన్స్ కు ఫోన్ చేయడం మరిచి.. కనీసం మానవత్వం లేకుండా చేతికందినన్ని చేపలు తీసుకుని పరుగులు పెట్టారు. 

ఆ తర్వాత పుప్రీ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రితేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటనకు కారణమైన ట్రక్కును సీజ్ చేసి విచారణ ప్రారంభించారు.