దేశంలో నాణ్యమైన విద్య పేదలకు అందటం లేదన్నారు సీఎం రేవంత్. తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఎందుకు ప్రైవేట్ లో చదివిస్తున్నరు? అని ప్రశ్నించారు. మనం నాణ్యమైన విద్యను అందిస్తే.. పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పంపుతారు అని అన్నారు. శుక్రవారం (జనవరి 16) హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. గ్రూప్ 3 అభ్యర్థులకు సీఎం నియామకపత్రాల అందజేశారు. మొత్తం 1,370 గ్రూప్ 3 పోస్టుల నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈరోజ పంచిపెట్టడానికి పోడుభూములు, అసైన్డ్ భూములు లేవని.. ఉన్నది ఒక్కటే.. నాణ్యమైన విద్యను అందించడమేనని అన్నారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అదే సమయంలో 11 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే.. అందులో 33 లక్షల విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ కు ఎందుకు పంపిస్తారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ ఫుల్ స్పీచ్:
- గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల మంది అప్లై చేశారు
- ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పనిచేస్తోంది
- మా ప్రభుత్వం రాగానే UPSCతో పోటీపడేలా TGPSCని ప్రక్షాళన చేశాం
- గతంలో RMP, డిప్యూటీ MRO, రిటైర్డ్ టీచర్లను TGPSCలో పెట్టారు
- నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం
- పదేళ్లు యువత ఆంకాక్షలు నెరవేరలేదు
- పదేళ్లు నిరుద్యోగులకు గత సర్కార్ పట్టించుకోలేదు
- లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు
- తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అంతా భావించారు
- ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించాం
- రెండేళ్లలో 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
- నియామక పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించాం
- పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలకే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది
- ఓపిక నశించిన యువత.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టారు
- తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు
- మీకు ఉద్యోగం ఇవ్వడం మా బాధ్యత కావచ్చు
- కానీ ఉద్యోగం మీ జీవితం
- రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి
- దాదాపు పదిన్నర లక్షల మంది ప్రభుత్వంతో పనిచేస్తున్నారు
- విద్యా, ఉద్యోగం, వ్యవసాయం ముఖ్యమని ఆనాడు నెహ్రూ అన్నారు
- శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్సారెస్పీల వల్లే తాగునీటి సమస్యలు లేవు
- స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో బురదమట్టి తిని బ్రతికిన రోజులున్నయ్
- దేశంలోనే తెలంగాణ అత్యధికంగా వరిని పండిస్తున్నది
- దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు.. కానీ ప్రోటీన్ ఫుడ్ అందటం లేదు
- ప్రతీ ఏటా లక్షా 10 వేల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు
- అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది
