సంక్రాంతి పండుగకు హైదరాబాదీలు సొంతూళ్లకు వెళ్లి సంబరాల్లో ఉంటే.. దొంగలు తాళాలేసిన ఇండ్లు పగలగొట్టి దోపిడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఎనిమిది ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు.
శుక్రవారం (జనవరి 16) మేడిపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల కనకదుర్గ నగర్ కాలనీ ఫేస్ 4 రోడ్ నంబర్ 2 లోని 6 ఇండ్లు, అణుశక్తి నగర్ కాలనీలో 2 ఇండ్లలో దొంగతనం చేసినట్లు గుర్తించారు.
రెండు రోజుల ముందు కాలనీలో చెట్ల మందులు కొడుతూ అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు తిరిగారు అని కాలనీ వాసులు తెలిపారు. సుమారు రాత్రి 1 నుండి 3 వరకు దొంగతనాలు జరిగాయని కాలనీ వాసులు తెలిపారు. బంగారం, వెండి, నగదు దొంగతనం అయినట్టు చెప్పారు.
ఇంటి యజమానులు సంక్రాంతి పండక్కి వెళ్లిన సమయంలో దొంగలు చోరీ చేశారు. మొత్తం ఎనిమిది ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రాథమికంగా 30 తులాల బంగారం, 8 కేజీల సిల్వర్, రెండు లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే దొంగతనంపై క్లూ సేకరించామని.. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ పుటేజ్, క్లూస్ టీం ఆధారాలు దోపిడీ వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
