IND vs NZ: ప్లేయింగ్ 11లో అర్షదీప్ సింగ్.. మూడో వన్డేకి రెండు మార్పులతో టీమిండియా

IND vs NZ: ప్లేయింగ్ 11లో అర్షదీప్ సింగ్.. మూడో వన్డేకి రెండు మార్పులతో టీమిండియా

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అదివారం (జనవరి 18) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడంతో ఆసక్తికరంగా మారనుంది. తొలి వన్డేలో ఇండియా గెలిస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం మూడు  మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుంది. దీంతో రెండు జట్లకు విజయం తప్పనిసరిగా మారింది. చివరి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11లో రెండు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అర్షదీప్, బడోనీలకు చోటు:

తొలి రెండు వన్డేల్లో భారత జట్టు బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. దీంతో ప్లేయింగ్ 11లోకి తొలి రెండు వన్డేల్లో బెంచ్ మీదున్న లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ ను తీసుకు రానున్నారు. తొలి రెండు వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపించని ప్రసిద్ కృష్ణ స్థానంలో అర్షదీప్ వచ్చే అవకాశముంది. బదోనీ కూడా భారత తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. బదోని జట్టులో ఉంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో స్పిన్ వేయగలడు. ఈ రెండు మార్పులు తప్ప మిగతా జట్టుతోనే మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగొచ్చు. 

కెప్టెన్ శుభమాన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి తిరుగు లేదు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఆడతాడు. టాప్ -5 వరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండవు. ఆరో స్థానంలో ఆయుష్ బదోని తొలి వన్డే ఆడే ఛాన్స్ ఉంది. ఏడో స్థానంలో జడేజా స్థానానికి ఎలాంటి డోకా లేదు. ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారు.

న్యూజిలాండ్ తో మూడో వన్డేకు ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్