ఈపీఎఫ్ ను ఇక నుంచి యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం కల్పించే దిశగా నిర్ణయం తీసుకోన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
ఎప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) లో కొంత మొత్తాన్ని ఫోన్ పే, భారత్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించేలా కార్మిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారుల నుంచి వ చ్చిన విశ్వసనీయ సమాచారం. మిగతా ఎమౌంట్ ఈపీఎఫ్ ఖాతాలోనే ఫ్రీజ్ అవనున్నట్లు తెలిపారు.
యూపీఐ ద్వారా రెగ్యులర్ యూపీఐ పిన్ ఎంటర్ చేసీ విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల మందికి ప్రయోజనం జరగనుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ కావాలంటే విత్ డ్రా క్లైమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టైమ్ టేకింగ్.. అదే విధంగా పనిభారం తో కూడిన వ్యవహారం. అందుకే యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తే.. సంస్థ పనిభారం తగ్గటంతో పాటు మెంబర్స్ కు కావాల్సిన సమయంలో విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
