బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్? ఏకగ్రీవంపై అధిష్ఠానం ఫోకస్

బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్? ఏకగ్రీవంపై అధిష్ఠానం ఫోకస్

ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనవరి 20న నూతన జాతీయ అధ్యక్షుడి ప్రకటన

ఢిల్లీ: బీజేపీకి మరికొన్ని రోజుల్లో కొత్త సారథి రానున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని హైకమాండ్ ప్రకటించింది. ఈ పదవికి జనవరి 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది. 20న కొత్త చీఫ్ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. 

19వ తేదీ మధ్యా హ్నం 2-4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్ల సమర్పణ, అనంతరం స్క్రూటినీ, అదేరోజు సాయంత్రం 5-6 గంటల మధ్యనామి నేషన్ల విత్ డ్రాకు చాన్స్ ఇచ్చారు. ఎన్నిక అవసరమైతే  జనవరి 20న పోలింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియంతా బీజేపీ హెడ్ ఆఫీసులో కొనసాగనుంది.  ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన 45 ఏండ్ల నితిన్ నబీన్ నే పార్టీ నూతన అధ్యక్షు డిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.