రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న చిత్రం 'స్పిరిట్' . భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'యానిమల్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత సందీప్ వంగా తీస్తున్న సినిమా కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది చిత్ర యూనిట్.
రిలీజ్ డేట్ వెనుక మాస్టర్ ప్లాన్!
'స్పిరిట్' చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఈపోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ తేదీని ఖరారు చేయడం వెనుక భారీ వ్యాపార లెక్కలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 5 (శుక్రవారం) సినిమా విడుదలవుతుండగా, మార్చి 6న మహాశివరాత్రి పండుగ ఉంది. ఆపై ఆదివారం సెలవు. అంతే కాకుండా మార్చి 10న రంజాన్ (Eid) సెలవు ఉండగా, అదే నెలలో హోలీ, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు వరుసగా ఉన్నాయి. ఈ సెలవులన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సృష్టించే విధ్వంసానికి భారీగా కలిసొచ్చే అవకాశం ఉంది విశ్లేషిస్తున్నారు.
Spirit release date :-)#Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026
ఫస్ట్ లుక్.. వైల్డ్ అండ్ రా!
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఇందులో ప్రభాస్ ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకుని, ఒంటిపై చొక్కా లేకుండా, గాయాలతో కనిపిస్తూ మునుపెన్నడూ చూడని 'రా' (Raw) లుక్‌లో దర్శనమిచ్చారు. హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ ఉన్న స్టిల్, సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీని చాటిచెప్పింది. ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ అయితే పూనకాలు తెప్పించింది.
పోలీస్ ఆఫీసరా.. ఖైదీనా?
'స్పిరిట్'లో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే, 'సౌండ్ స్టోరీ' గ్లింప్స్ ప్రకారం.. అకాడమీ టాపర్ అయిన ఒక ఐపీఎస్ అధికారి, రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. జైలర్ పాత్రలో ప్రకాష్ రాజ్, ప్రభాస్ మధ్య వచ్చే సంభాషణలు సినిమాకే హైలైట్ కానున్నాయి. ద్వితీయార్ధంలో వచ్చే మాఫియా బ్యాక్‌డ్రాప్ సీక్వెన్స్ ప్రేక్షకులకు నూటికి నూరు శాతం థ్రిల్‌ను పంచుతాయని సమాచారం.
తొమ్మిది భాషల్లో విడుదల!
టి-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు కొరియన్, జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలతో కలిపి మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్న సంగీతం ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వెన్నెముకగా నిలవనుంది. మొత్తానికి, 'వన్ బ్యాడ్ హ్యాబిట్' అంటూ గ్లింప్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్, 2027 మార్చిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.
