ఉజ్బెకిస్థాన్ దగ్గు మందు ఘటనపై నిజానిజాలు తేల్చండి : కేంద్ర వైద్యారోగ్యశాఖ

ఉజ్బెకిస్థాన్ దగ్గు మందు ఘటనపై నిజానిజాలు తేల్చండి  : కేంద్ర వైద్యారోగ్యశాఖ

భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి.. ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు చనిపోవడంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించింది. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి 18 మంది పిల్లలు మరణించారని ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది. ఆ మందులో ప్రమాదకరమైన పదార్థం ఉందని, తమ ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలిందని చెప్పింది. పిల్లలు తీసుకున్న ఈ సిరప్ నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందు డాక్ 1మాక్స్ గా నిర్థారించిన ఉజ్బెకిస్తాన్.. అందులో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిపింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వారి తల్లిదండ్రులు, ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు, పిల్లలకు ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ మొత్తంలో సిరప్‌ను పిల్లలకు అందించినట్లు కూడా పేర్కొంది.