పెట్టుబడులను ఆకర్షించేలా ఉంది.. బడ్జెట్ ‘వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌’ కు నిర్వచనం ఇచ్చింది: అమిత్ షా

పెట్టుబడులను  ఆకర్షించేలా ఉంది.. బడ్జెట్ ‘వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌’ కు నిర్వచనం ఇచ్చింది: అమిత్ షా

న్యూఢిల్లీ: అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా బడ్జెట్​ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు. బడ్జెట్​ అనంతరం అమిత్ షా వరుస ట్వీట్స్​ చేశారు. తయారీ నుంచి మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం నుంచి పర్యాటకం, గ్రామీణ ప్రాంతాల నుంచి ఏఐ, క్రీడల నుంచి తీర్థయాత్రల వరకు అన్ని రంగాల్లో ‘వికసిత్​ భారత్‌‌‌‌‌‌‌‌’ కన్పించిందన్నారు. 

యువత, మహిళలు, రైతుల కలలకు ఈ ప్రణాళిక శక్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలోని ప్రజలు తమ ఆశయాలను సాకారం చేసుకునేందుకు ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ తోడ్పడుతుందన్నారు. దేశ వృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్​ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్​కు అమిత్‌‌‌‌‌‌‌‌ షా అభినందనలు తెలిపారు. 

2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‌‌‌‌‌‌‌‌’ లక్ష్యాన్ని చేరుకునేలా 25 ఏండ్ల రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌ను ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రూపొందించిందన్నారు. “ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌, వికసిత భారత్‌‌‌‌‌‌‌‌ కేవలం నినాదం కాదు.. సంకల్పం. ప్రతి రంగం, ప్రతి వర్గం, ప్రతి పౌరుడిని శక్తివంతం చేసే స్పష్టమైన బ్లూప్రింట్‌‌‌‌‌‌‌‌ ఇది” అని అన్నారు.

 ‘మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్‌‌‌‌‌‌‌‌ యోజనను ప్రారంభించడం చారిత్రక నిర్ణయం. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నేతన్నలు, రైతులు, హ్యాండ్లూమ్‌‌‌‌‌‌‌‌ రంగానికి ఇది ఊతం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.