
గూగుల్ మ్యాప్ గురించి మనందరికి తెలిసిందే.. తెలియని ప్రాంతాలకు వెళ్లేందుకు స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేసి.. దాని డైరెక్షన్ లో మనం చేరుకోవాల్సిన ప్రాంతాలకు వెళ్తుంటాం. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద పెద్ద నగరాలతోపాటు.. చిన్నా పట్టణాల్లో కూడా ఈ గూగుల్ మ్యాప్ ను ఉపయోగిస్తుంటారు.. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ ఎర్రర్ తో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటన చాలా చూశాం.. విన్నాం.. తాజాగా గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని తాను వెళ్లాల్సిన ఫ్లైట్ ను మిస్సయ్యాడు ఓ వ్యాపార వేత్త.. గూగుల్ మ్యాప్ తో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను సోషల్ మీడియా ప్లాట్ ఫాంX లో షేర్ చేశాడు..
ఆశీస్ కచోలియా.. ఓ వ్యాపారవేత్త.. బెంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు.. సమయానికి ఎయిర్ పోర్ట్ చేరుకునేందుకు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుండగా.. టైం, రూల్ డైరెక్షన్ కోసం గూగుల్ మ్యాప్ ను ఎంచుకున్నాడు.. అయితే ఆశీష్ కచోలియాను గూగుల్ మ్యాప్ తప్పుదోవ పట్టించింది.. ధీంతో కచోలియా తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.
గూగుల్ మ్యాప్ ను ఆశ్రయించిన కచోలియాకు.. తాను ఎయిర్ పోర్టు చేరుకునేందుకు టైం 1.45 నిమిషాలుపడుతుందని గూగుల్ చూపింది..అయితే ట్రాఫిక్ రద్దీ లేకున్నా.. తాను ఎయిర్ పోర్టు చేరుకునేందుకు 3 గంటలుపట్టిందని.. తాను ఎక్కాల్సినఫ్లైట్ మిస్సయిందని కచోలియా తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.
గూగుల్ మ్యాప్స్ లో సరైన ప్రయాణ సమయం చూపించలేదు.. దీంతో తాను ఎక్కాల్సిన విమానం రద్దయిందని పోస్ట్ షేర్ చేసిన కచోలియాతోచాలామంది నెటిజన్లు ఏకీభవించారు. గూగుల్ అంచనాలు నమ్మశక్యం కానివి.. నగరాల్లో కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సిన వచ్చినపుడు స్థానికులను అడిగి తెలుసుకుంటే మంచిదని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
గూగుల్ మ్యాప్ లో ప్రయాణ సమయాన్ని విశ్వసించలేని ఏకైక నగరం బెంగళూరు అని మరో నెటిజన్ రాశాడు. గుర్గావ్ లో కూడా అరుదుగా జరుగుతుంటాయని చెపుతున్నారు నెటిజన్లు.
కచోలిన తన పోస్టులో ముంబై, బెంగళూరు నగరాల్లో మౌలిక సదుపాయాలను పోల్చుతూ రాశాడు.. బెంగళూరు కంటే ముంబై నగరంలోని మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి.. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు కృతజ్ణతలు అంటూ పోస్టు లో రాశాడు..
ఏదీ ఏమైనా కొత్త అడ్రస్ లకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ తో పాటు స్థానికులను ఆరా తీస్తే మంచిదని కచోలియా పోస్ట్ లో నెటిజన్లకు బోధపడుతోంది.