
- ఈ నెల 29వ తేదీ వరకు అప్లికేషన్‌కు అవకాశం
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు(సహ) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచార కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు పత్రాలను www.telangana.-gov.in, tsic.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను రిజిస్టర్ పోస్టులో బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ సీఎస్ కార్యాలయానికి పంపాలని చెప్పారు. గతేడాది జులైలో బీఆర్ఎస్ హయాంలో సమాచార కమిషనర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్నవారు.. కొత్తగా ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.