
జేఎన్టీయూ, వెలుగు: అమెరికాలో జరగనున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌కు కూకట్ పల్లి జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్‌కు ఆహ్వానం అందింది. ‘స్మార్ట్ మొబిలిటీ అండ్ వెహికల్ ఎలక్ట్రిఫికేషన్’ అంశంపై అక్టోబర్10 నుంచి 12 వరకు అమెరికాలోని ఐఈవోఎం సొసైటీ నిర్వహించే ఇంటర్నేషనల్ సెమినార్లో మంజూర్ హుస్సేన్ పాల్గొననున్నారు. సెమినార్లో పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.