ఢిల్లీలో ఉండలేక మాల్దీవ్స్‌‌కు కివీస్ ప్లేయర్లు జంప్

ఢిల్లీలో ఉండలేక మాల్దీవ్స్‌‌కు కివీస్ ప్లేయర్లు జంప్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ మరో ఇద్దరు కివీస్‌‌‌‌  క్రికెటర్లు మనసు మార్చుకున్నారు. కోవిడ్‌‌‌‌ హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా మారిన ఢిల్లీలో ఉండలేకపోయారు. తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  మినీ బయో బబుల్‌‌‌‌ను కాదనుకొని శుక్రవారం మాల్దీవ్స్‌‌‌‌ వెళ్లిపోయారు. సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అయిన విలియమ్సన్‌‌‌‌, సీఎస్‌‌‌‌కే ప్లేయర్‌‌‌‌ మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌, ఆర్‌‌‌‌సీబీ బౌలర్‌‌‌‌ కైల్‌‌‌‌ జెమీసన్‌‌‌‌, సీఎస్‌‌‌‌కే ఫిజియో టామీ సిమ్​సెస్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ఎక్కారు. వాస్తవానికి ఈ నలుగురూ  ఈ నెల 10వ తేదీ వరకూ ఢిల్లీలో ఉండి 11న ప్రత్యేక విమానంలో యూకే వెళ్లాల్సి ఉంది.

కరోనా ఉధృతి నేపథ్యంలో తమ ప్లేయర్ల సేఫ్టీ దృష్ట్యా న్యూజిలాండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు  (ఎన్‌‌‌‌జెడ్‌‌‌‌సీ)ఢిల్లీలో వీరి కోసం మినీ బయో బబుల్‌‌‌‌ ఏర్పాట్లు చేయించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండడం సేఫ్‌‌‌‌ కాదని భావించిన కేన్‌‌‌‌, ఇతరులు మాల్దీవ్స్‌‌‌‌ వెళ్లాలని డిసైడయ్యారని సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఫ్రాంచైజీ తెలిపింది. కాగా, కివీస్‌‌‌‌ పేసర్‌‌‌‌ ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌  తన ఫ్యామిలీని చూసేందుకు స్వదేశం  వెళ్లిపోయాడు. ఐపీఎల్‌‌‌‌లో ఆడిన మిగతా ప్లేయర్ల కోసం  ఏర్పాట్లు చేసిన చార్టెడ్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ఎక్కాడు.