IPL 2026: కమిన్స్కే సన్ రైజర్స్ కెప్టెన్సీ.. మూడో సీజన్ సారథ్య బాధ్యతలు కూడా ఆసీస్ పేసర్కే..

IPL 2026: కమిన్స్కే సన్ రైజర్స్ కెప్టెన్సీ.. మూడో సీజన్ సారథ్య బాధ్యతలు కూడా ఆసీస్ పేసర్కే..

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌‌‌‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్‌‌‌‌గా ఆస్ట్రేలియా పేస్ స్టార్ ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. వరుసగా మూడో సీజన్‌‌‌‌లో తమ జట్టును కమిన్స్ నడిపిస్తాడని సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ సోమవారం (నవంబర్ 17) ప్రకటించింది. 2024 ఐపీఎల్ వేలానికి ముందు సౌతాఫ్రికా ప్లేయర్  ఐడెన్ మార్​క్రమ్​ స్థానంలో కమిన్స్‌‌‌‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.  

ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్,  వన్డే వరల్డ్ కప్ అందించిన  అతడిని సన్ రైజర్స్  2024 వేలంలో ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.  ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న అతను  ఇంగ్లండ్‌‌‌‌తో ఈ నెల 21 నుంచి జరిగే యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు దూరమయ్యాడు.

రాజస్తాన్‌‌ హెడ్‌‌ కోచ్‌‌గా సంగక్కర

రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ హెడ్‌‌ కోచ్‌‌గా కుమార సంగక్కర మళ్లీ బాధ్యతలు స్వీకరించాడు. 2021 నుంచి ఫ్రాంచైజీ డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ క్రికెట్‌‌గా వ్యవహరిస్తున్న సంగా.. ద్రవిడ్‌‌ ప్లేస్‌‌లో ఈ బాధ్యతలు చేపట్టాడు.  సంగక్కర డెరెక్టర్‌‌తో పాటు హెడ్‌‌ కోచ్‌‌గానూ వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ ఎక్స్‌‌లో పోస్ట్‌‌ చేసింది.