ముంబై: ఐపీఎల్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలను టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుత కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్ జట్టులో చేరడంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కిషన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్, నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి సరైనోడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా, వన్ డౌన్‌లోనూ రాణించి ఇండియాకు కీలక విజయాలు అందించిన కిషన్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం, ఇప్పటికే అతనితో ప్రాథమిక చర్చలు జరిపింది. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకుంటే సీజన్ మొత్తం కిషన్ జట్టును నడిపించే చాన్సుంది.
