ఐపీఎల్ లో అత్యధిక ధర.. సామ్ కరణ్ రూ.18.50 కోట్లు

ఐపీఎల్ లో అత్యధిక ధర.. సామ్ కరణ్ రూ.18.50 కోట్లు
  • మనీశ్‌ పాండే రూ. 2.4 కోట్లు (ఢిల్లీ) 
  • జాక్స్ రూ.3.2కోట్లు (బెంగళూరు)
  • శివమ్ మావి  రూ.6 కోట్లు( గుజరాత్ టైటాన్స్)
  • ముకేశ్‌ కుమార్‌ ఢిల్లీ రూ. 5.5 కోట్ల(ఢిల్లీ కాపిటల్స్) 
  • నిషాంత్ సింధు రూ.60 లక్షలు(చెన్నై సూపర్ కింగ్స్)
  • వైభవ్‌ అరోరా రూ.60లక్షలు(కోల్ కతా)
  • యశ్ ఠాకూర్‌   రూ. 45 లక్షలు(లక్‌నవూ)
  • సన్విర్ సింగ్  రూ.20లక్షలు( సన్ రైజర్స్)
  • సమర్థ్ వ్యాస్ రూ. 20 లక్షలు ( సన్ రైజర్స్)
  • కేఎస్ భరత్‌ రూ. 1.2 కోట్లు( గుజరాత్‌ ) 

బెన్ స్టోక్స్ ధర రూ.16.25 కోట్లు

  • ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్  రూ.16.25 కోట్లు( చెన్నై సూపర్ కింగ్స్)
  • వెస్టిండీస్  ఆటగాడు నికోలస్ పూరన్  రూ. 16 కోట్లు (లక్నో సూపర్ జాయింట్)
  • హెన్రిచ్ క్లాసెస్   రూ. 5.25 కోట్లు ( సన్ రైజర్స్)
  • వివ్రంత్ శర్మ  రూ.2.6 కోట్లు(సన్ రైజర్స్)
  • న్యూజిలాండ్ టాప్ క్రికెటర్ కేన్ విలియమ్సన్   రూ.2కోట్లు( గుజరాత్ )
  • ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్  అదిల్ రషీద్ రూ.2 కోట్లు(  సన్ రైజర్స్ )
  • ఫిల్‌ సాల్ట్‌ ధర రూ. 2 కోట్లు(ఢిల్లీ )
  • ఆస్ట్రేలియా ప్లేయర్ రిచర్డ్సన్  రూ. 1.5 కోట్లు( ముంబై ఇండియన్స్)
  • రీస్‌ టోప్లే ధర రూ.1.9 కోట్లు( బెంగళూరు )
  • భారత బౌలర్‌ జయ్‌దేవ్ ఉనద్కత్‌ రూ. 50 లక్షలు(లక్‌నవూ )
  • ఇషాంత్ శర్మ ధర  రూ. 50 లక్షలు(ఢిల్లీ)
  • సికిందర్‌ రజా రూ.50 లక్షలు( పంజాబ్)
  • ఓడియన్ స్మిత్‌  రూ.50 లక్షలు(గుజరాత్‌ )
  • షేక్ రషీద్ ధర రూ. 20 లక్షలు( చెన్నై)

ఐపీఎల్ మినీ వేలం 2023 కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరణ్ వేలంలో రికార్డ్ సృష్టించాడు. ఇతగాడిని 18.50 కోట్లకు  పంజాబ్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇతని తర్వాత ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్‌ను  ముంబయి ఇండియన్స్‌ రూ.17.50 కోట్లకు సొంతం చేసుకొంది.

 

ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను వేలంలో    రూ. 13.25 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. రాజస్థాన్ , బెంగళూరుతో పోటీ పడి మరీ దక్కించుకుంది. ఇక పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను కూడా హైదరాబాద్ 8.25కోట్లకు దక్కించుకుంది. జాసన్ హోల్డర్ ను రాజస్థాన్ రాయల్స్‌కు 5.75 కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ టాప్ క్రికెటర్ కేన్ విలియమ్స న్ ను గుజరాత్ రూ.2కోట్లకు సొంతం చేసుకుంది.అజింక్యా రహానెను రూ. 50 లక్షలకు చెన్నై దక్కించుకోగా.. జో రూట్‌, రిలీ రోసోవ్‌,షకీబ్ అల్ హసన్  అమ్ముడుపోలేదు.

 

ఎవరిదగ్గర ఎంత ఉందంటే?


చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 20.45 కోట్లు (9 స్లాట్లు)

ముంబై ఇండియన్స్ – రూ. 20.05 కోట్లు (12 స్లాట్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 7.05 కోట్లు (14 స్లాట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ 19.45 కోట్లు (7 స్లాట్లు)
పంజాబ్ కింగ్స్ - రూ 32.2 కోట్లు (12 స్లాట్లు)
గుజరాత్ టైటాన్స్ – రూ. 19.25 కోట్లు (10 స్లాట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 23.35 కోట్లు (14 స్లాట్లు)