
- రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లే చాన్స్
- అధికారికంగా స్పందించని చెన్నై ఫ్రాంచైజీ
చెన్నై: ఐపీఎల్ రిటెన్షన్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ప్లేయర్ల ట్రేడింగ్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. రాజస్తాన్ రాయల్స్, సంజూ శాంసన్ ఎపిసోడ్ ముగియకముందే.. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌ను వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన భవిష్యత్‌పై ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే దీనిపై అశ్విన్‌గాని, ఫ్రాంచైజీగాని అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ‘ప్లేయర్ల భవిష్యత్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్య అవుతుంది. రిటెన్షన్ తేదీ ఇంకా ప్రకటించలేదు. కాబట్టి మాకు చాలా టైమ్ ఉంది. ప్లేయర్లతో చర్చలు జరపడం ముందస్తు వేలంలో భాగమే. అశ్విన్ సీనియర్ ప్లేయర్. వచ్చే సీజన్‌కు జట్టులో అతని పాత్ర గురించి తెలుసుకోవడం పరస్పర చర్య’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
2009 నుంచి 2015 వరకు సీఎస్కేకు ఆడిన అశ్విన్ 2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో రూ. 9.75 కోట్లకు మళ్లీ చెన్నైకి వచ్చాడు. . గతేడాది చెన్నై తరఫున 9 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 7 వికెట్లు మాత్రమే తీశాడు. .
శాంసన్‌కు బదులుగా..
ఒకవేళ అశ్విన్ సీఎస్కేను విడిచిపెడితే రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని తెలుస్తోంది. గతంలో 2022 నుంచి 2024 వరకు అశ్విన్ రాజస్తాన్‌కు ఆడి మంచి సక్సెస్ సాధించాడు.
అదే టైమ్‌లో వచ్చే సీజన్‌కు జట్టును బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న చెన్నై.. ధోనీ ప్లేస్‌లో సరైన కెప్టెన్ కోసం చూస్తోంది. ఈ క్రమంలో అశ్విన్‌ను ట్రేడ్ చేసి సంజూ శాంసన్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
కెప్టెన్, వికెట్ కీపర్‌గా మహీ స్థానాన్ని శాంసన్ భర్తీ చేస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్క ట్రేడింగ్‌తో సీఎస్కేను మళ్లీ గాడిలో పెట్టాలనే ఆలోచన ఫ్రాంచైజీ చేస్తోంది. మరోవైపు శాంసన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. కేకేఆర్, ముంబై జట్లకు నాణ్యమైన కీపర్ లేడు. ఆ ప్లేస్‌ను శాంసన్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నాయి.