
IPL 2019 సీజన్ మొదటి మ్యాచ్ మొదలైంది ఈ మ్యాచ్ లో.. చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చెన్నై టీంకు ధోనీ నాయకత్వం వహిస్తుండగా.. బెంగళూరుకు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నారు. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. 2018 సిజన్ లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి ఖాతాను తెరవాలని బెంగళూరు భావిస్తుంది. అయితే స్వతహాగా.. చెన్నైలో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న సూపర్ కింగ్స్ కు గెలుపు నల్లేరు పై నడక అని అంటున్నారు ఆ టీం ఫ్యాన్స్.
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
చెన్నై: ధోనీ (కెప్టెన్), రైనా, వాట్సన్, రాయుడు, జాదవ్, బ్రావో, డుప్లెసిస్, జడేజా, దీపక్ చాహర్, డేవిడ్ విల్లే, మోహిత్ శర్మ.
బెంగళూరు: కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్, మొయిన్ అలీ, డివిల్లీర్స్, హెట్‌మయెర్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, చాహల్.